సాగునీరిస్తే సీఎంది దొంగతనం అంటావా?

పోతిరెడ్డిపాడు నుంచి రైతులకు సాగు, తాగునీరు అందిస్తుంటే… సీఎం చంద్రబాబు దొంగతనం చేస్తున్నారని జగన్‌ పత్రికలో పేర్కొనడం దారుణమని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి విమర్శించారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదలచేసే విషయంపై జగన్‌ తన పత్రిక ద్వారా తెలంగాణలో విష ప్రచారం చేయడం దారుణమన్నారు. ‘రాయలసీమపై ఎందుకు విషం కక్కుతున్నావు? ఇక్కడివారు మీకు మనుషుల్లా కనిపించడం లేదా? మీరు అసలు రాయలసీమలోనే పుట్టారా? అన్న అనుమానం కలుగుతోంది’ అని ధ్వజమెత్తారు. కాగా, పుట్టిన సీమపైనే జగన్‌ […]

జగన్‌ పత్రిక రాతలు ఛీ.. ఛీ..!

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు చెందిన పత్రికలో కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ ఎడిషన్‌లో వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఆంధ్రులను నీటి దొంగలుగా రాయడం హేయమంటూ తీవ్రంగా స్పందించారు. శనివారమిక్కడ క్యాంపు కార్యాలయంలో జలసిరికి సంబంధించిన పాట ’జల జల జల జలసిరికి హారతి… జన జన జన జనసిరికి హారతి’ని చంద్రబాబు విడుదల చేశారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న జగన్‌.. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ వాళ్లను […]