2019లో ఎన్నికల్లోనూ చంద్రబాబే సీఎం: దేవినేని అవినాష్

నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత జగన్‌కు భయం పట్టుకుందని టీడీపీ యువనేత దేవినేని అవినాష్ అన్నారు. 2019లో ఎన్నికల్లోనూ చంద్రబాబే సీఎం అవుతారని ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన తెలిపారు. పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారిని బతిమాలే పరిస్థితికి జగన్ వచ్చారన్నారు. జగన్ పాదయాత్ర ప్రజల కోసం కాదు … కోర్టుకు హాజరుకాకుండా ఉండేందుకే అని ఆయన ఆరోపించారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వెల్లడించారు. కేసుల మాఫీ కోసమే […]

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపికి అధిక ప్రాధాన్యం: గడ్కరీ

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఒక్క ఏపీలోనే లక్ష కోట్ల ఖర్చుతో జాతీయ రహదారులను నిర్మిస్తున్నామని అన్నారు. శంకుస్థాపన కార్యక్రమాల తర్వాత గడ్కరీ పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను పరిశీలించారు. 4వ జాతీయ జలరవాణా మార్గానికి ఉపరాష్ట్రపతి వెంక్యనాయుడు విజయవాడలో శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు, గడ్కరీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి భారీగా హైవే ప్రాజెక్టులు రావడం ఇదే ప్రథమమని చంద్రబాబు అన్నారు. వాజ్‌పేయి […]

సమష్టి కృషితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: చంద్రబాబు

సమష్టి కృషితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టికృషి అవసరమని వ్యాఖ్యానించారు. మండల స్థాయిలోనూ అభివృద్ధి రేటును నమోదు చేస్తున్నామని, గ్రామస్థాయి, కుటుంబ స్థాయిలోనూ అభివృద్ధిరేటు నమోదు చేయాలని చెప్పారు. గత కలెక్టర్ల సదస్సులో ప్రజలే ముందు పరిష్కార వేదిక… కాల్‌ సెంటర్‌ను ప్రారంభించామన్నారు. ఇప్పుడు ప్రజలే ముందు మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించామని సీఎం పేర్కొన్నారు. ‘‘నేను ఎప్పుడూ విద్యార్థిలాగే ఆలోచిస్తా. విద్యార్థికి మార్కుల మాదిరిగా మనకు వృద్ధిరేటు ముఖ్యం. […]