నీరు, విద్యుత్‌ వల్లే సుస్థిరాభివృద్ధి.. అందుకే వాటిపై దృష్టి సారించాం

రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి ఇంధన భద్రత.. జల భద్రత ముఖ్యమని, అందుకే ఆ రెండింటిపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన బహిరంగ లేఖ రాశారు. విభజన కష్టాలతో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలనన్న నమ్మకంతో తనకు బాధ్యతలు అప్పగించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోనని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, ప్రపంచంలోని ఉత్తమ రాష్ట్రాల్లో ఏపీని ఒకటిగా నిలపడమే […]

పోలవరానికి 2800 కోట్లు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలో రూ.2800 కోట్లు ఇస్తామని కేంద్ర జలవనరులు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌ కార్యాలయంలో గడ్కరీతో సమావేశమై రాష్ట్రంలోని ఇరిగేషన్‌, రహదారుల ప్రాజెక్టుల గురించి వివరించి, వాటిని పూర్తి చేయడానికి ఆర్థికంగా సహకరించాలని కోరినప్పుడు… గడ్కరీ ఈ మేరకు హామీ ఇచ్చారు. పలు జాతీయ రహదారులు, ముక్త్యాల- విజయవాడ జలమార్గం శంకుస్థాపనకు వచ్చే నెల 3వ తేదీన రాష్ట్రానికి వస్తున్నానని, […]

భారీగా ఉపాధి అవకాశం

భారీ పరిశ్రమలకే కాకుండా ఎంఎస్‌ఎంఇలు ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారు. గత రెండేళ్లుగా విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సుల్లో భారీ, మధ్య తరగతి పరిశ్రమల ఏర్పాటు కోసం ఇంధన, మౌలిక సదుపాయాల శాఖలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే ఈ సదస్సుల్లో ఎంఎస్‌ఎంఇల ఉనికిని ఏ మాత్రం గుర్తించడం లేదు. భారీ పెట్టుబడులు పెట్టే పరిశ్రమలతో పోలిస్తే ఎంఎస్‌ఎంఇల్లో పెట్టుబడులు తక్కువగానే ఉన్నప్పటికీ .. స్థానిక యువతకు ముఖ్యంగా పదో తరగతిలోపు […]

తీరు మారాల్సిందే!

‘లబ్ధిదారులు రుణమంజూరు పత్రాలతో వెళ్లినా బ్యాంకులు స్పందించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెస్తోంది. ఈ విషయంలో బ్యాంకులు తమ పనితీరు మార్చుకోవడానికి అక్టోబరు 31 వరకు గడువు ఇస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు బ్యాంకర్లను ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకింగ్‌ రంగానిదే కీలకపాత్ర అని, బ్యాంకులకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయం అవసరమని సీఎం స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సమావేశంలో ఆయన […]

సంక్షేమంలో రాజకీయాల్లేవు

‘పేదల సంక్షేమంలో రాజకీయాలు లేవు. అర్హుడు ఏ పార్టీవాడైనా సాయం అంది తీరాల్సిందే.’ అని సీఎం స్పష్టం చేశారు. ప్రధాన పథకాలన్నీ సంతృప్త స్థాయి వరకూ అమలు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్క అర్హుడికీ లబ్ధి అంది తీరుతుందన్నారు. ‘ఒకప్పుడు ఎన్టీఆర్‌ హయాంలో కిలో బియ్యం రెండు రూపాయలకు ఇస్తే ఎంతో అపురూపంగా చెప్పుకొన్నారు. ఇప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. చివరకు పేదలు పెళ్లి చేసుకున్నా వారి సామాజిక స్థాయిని బట్టి రూ.50 వేల […]

అర్హులకు అన్నీ ఇస్తున్నాం…అభివృద్ధిని పరుగు పెట్టిస్తున్నాం

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వమే రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ‘అర్హులైన వారి ప్రతి అవసరం తీరుస్తున్నాం. పార్టీలకతీతంగా అందరికీ రేషన్‌, పింఛన్లు, ఇళ్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకువెళుతున్నాం. ఇన్ని చేస్తున్న ఈ ప్రభుత్వం ఉండగా మిగిలిన పార్టీల అవసరం ఏమిటి? పార్టీలను పక్కనపెట్టి ప్రజలు కూడా ఆలోచించాలి. మళ్లీ మా ప్రభుత్వానికే మద్దతు ఇవ్వాలి’ అని సీఎం ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన […]

కులాల చిచ్చుపై జాగ్రత్త

‘మంజునాథ కమిషన్‌ నివేదిక ఇవ్వగానే కాపుల రిజర్వేషన్‌పై నిర్ణయం తీసుకుంటాం. అయినా ప్రజల్లో గొడవలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తుంటే రాజకీయ స్వార్థం కోసం మరికొందరు రెచ్చగొడుతున్నారు. అటువంటి వారి ఆటలు సాగనివ్వొద్దు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేయండి’ అని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో కులాల విషయంలోనూ, పరిశ్రమలకు వ్యతిరేకంగానూ జరిపే నిరసనలపై పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని నిర్దేశించారు. ‘రాష్ట్రంలో ఉన్న వ్యక్తులతోపాటు తెలంగాణలో ఉంటున్న కంచె ఐలయ్య వైశ్యుల […]

ఇకపై ప్రతి నెలా హెల్త్‌ బులిటెన్‌: చంద్రబాబు

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఇకపై ప్రతి నెలా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసేందుకు ఆరోగ్యశాఖ సిద్ధమయింది. జూలై-ఆగస్టు హెల్త్‌ బులిటెన్‌ను కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం ఆవిష్కరించారు. సీటీస్కాన్‌, ఎక్స్‌రే, ల్యాబ్‌, డయాలసిస్‌ తదితర ఉచిత సేవల సమాచారాన్ని ఈ బులిటెన్‌ ద్వారా విడుదల చేస్తారు. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడమే లక్ష్యంగా ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన 181 కాల్‌ సెంటర్‌ని సీఎం ఆవిష్కరించారు. గృహహింస, ఈవ్‌టీజింగ్‌, మానవ అక్రమ రవాణా వంటి సమస్యలకు 181 ద్వారా పరిష్కారం […]

వేలంలో ముందే పాల్గొనొచ్చుగా!

‘సదావర్తి సత్రం భూములపై నిజంగా ఆసక్తి ఉంటే.. ముందువేసిన వేలంలోనే వైసీపీ నేతలు పాల్గొని ఉండొచ్చు కదా! కావాలనే వివాదం రేకెత్తించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఈ భూముల విషయంలో దేవాదాయ శాఖ నిజాయితీగా వ్యవహరించిందని, ముందుగానే వేలంపై ప్రచారం నిర్వహించిందని గుర్తుచేశారు. ఇప్పుడు రెండోసారి వేలం అయ్యాక కూడా దానిపై వివాదం కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. కలెక్టర్ల సదస్సు రెండోరోజున ముఖ్యమంత్రి రెవెన్యూ, రిజిస్ర్టేషన్‌ అంశాలపై సమీక్షించారు. భూవివాదాలు ఎలా ఉంటాయో సదావర్తి వ్యవహారమే అద్భుత […]