పట్టిసీమ కల నెరవేరింది: దేవినేని

పట్టిసీమ ద్వారా 80 టీఎంసీల నీరు తీసుకురావాలన్న సీఎం చంద్రబాబునాయుడి కల నెరవేరిందని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో భూగర్భ జలాల సగటు 10.44 మీటర్లుగా ఉందని అన్నారు. సగటున ఐదు మీటర్ల మేరకు భూగర్భ జలాలు పెరిగాయన్నారు. పలు మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వైఎస్‌ హయాంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు అంచనా వ్యయాలు పెంచి దండుకున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుపై వైవీ సుబ్బారెడ్డికి మాట్లాడే అర్హత లేదన్నారు.

రేవంత్‌ వ్యవహారం మీడియా సృష్టే: లోకేశ్‌

తెలంగాణ రాష్ట్ర టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలు మీడియా సృష్టేనని మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు.

మెగా సీడ్‌కు ఐయోవా సాయం: సోమిరెడ్డి

అమెరికాలోని ఐయోవా రాష్ట్ర విశ్వవిద్యాలయ సహకారంతో కర్నూలు జిల్లా తంగడంచలో మెగా సీడ్‌ పార్కును అభివృద్ధి చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి తెలిపారు.

జాబ్‌ ఉందని సరిపెట్టుకోవద్దు ఉద్యోగాలిచ్చేలా ఎదగండి: సీఎం

నవ్యాంధ్రలో తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ప్రవాస భారతీయులు ముందుకొచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా షికాగో చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అక్కడి ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు.

రేవంత్‌రెడ్డివి అసత్య ఆరోపణలు: చినరాజప్ప

తెలంగాణ తెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి కావాలనే మంత్రులపై బురదజల్లుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం గోరింటలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రికి, ఆంధ్రప్రదేశ్‌ మంత్రులకు ఎలాంటి సంబంధాలు లేవని, దీనిపై రేవంత్‌రెడ్డి చేస్తున్నవన్నీ అసత్య ఆరోపణలేనని పేర్కొన్నారు. ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.2వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారన్నది అవాస్తవమని తెలిపారు. రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి […]

బీసీల్లో చిచ్చు పెడుతున్న జగన్‌

జగన్మోహన్‌రెడ్డి బీసీల్లో చిచ్చు పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వివిధ సంఘాల నాయకులు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాకే బీసీ వర్గాలకు ప్రాధాన్యం లభించిందని వివరించారు. విదేశీ విద్య పథకంతో పాటు ఫెడరేషన్లు ఏర్పాటు చేసి భారీ మొత్తంలో నిధులు అందిస్తోందని గుర్తుచేశారు. శాలివాహన, సగర ఉప్పర, రజక ఫెడరేషన్ల అధ్యక్షులు తుగ్గలి నాగేంద్ర, ఏడుకొండలు, ఆర్‌.నారాయణ; మాజీ మంత్రి మారెప్ప సచివాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీలను తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకుగా […]

బుట్టా రేణుక టీడీపీలోకి వెళ్లక ముందు ఏం జరిగింది ?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠ మంగళవారం అమరావతిలో కలిశారు. ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు వారు మద్దతు ప్రకటించారు. అనధికారికంగా ఆమె టీడీపీలో చేరినట్లే. సాంకేతిక కారణాల దృష్ట్యా ఆమె ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ప్రకటిస్తున్నట్లు వివరించారు. ఆమెతో పాటు సీఎం బాబును కలిసిన కోడుమూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, పలువురు వైసీపీ కా ర్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు […]