సీఎం కేసీఆర్‌కు రేవంత్ లేఖ

రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. రైతు పోరుబాటలో రైతుల సమస్యలు తెలుసుకున్నానని, రుణమాఫీ వడ్డీలకే సరిపోతోందని లేఖలో పేర్కొన్నారు. ఖమ్మం, వరంగల్, నల్లగొండ, నిజాబాబాద్ జిల్లాల్లో నకిలీ విత్తనాల వల్ల రైతులు పంట నష్టపోయారన్నారు. వారికి ఎకరాకు రూ.40 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.6 లక్షల పరిహారం హామీ అమలు కావడం లేదని తెలిపారు. కేంద్రం ఇచ్చిన ఇన్‌పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దుతో రైతులు అవస్థలు పడుతున్నారని, రైతులను ఆదుకునే మార్గాలు ఆలోచించాలని రేవంత్‌ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Comments

comments

Leave a Reply

*