సంక్రాంతి వేడుకలకు జిల్లాకు రూ.కోటి

సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రజలంతా ఆనందంగా జరుపుకొనేందుకు జిల్లాకు కోటి చొప్పున రూ.13 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర సమాచార, ఐటీ, సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. రైతులకు పెద్ద పండుగ అయినందున వారికి అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిదని చెప్పారు. ఆడపడుచుల కోసం ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజధాని అమరావతిలో ఈ పండుగను ముఖ్యమంత్రి సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

సచివాలయంలో ఉద్యోగులంతా ఆనందంగా పండుగ సంబరాల్లో పాల్గొనేందుకు ఇప్పటికే 3 లక్షల రూపాయలు మంజూరు చేశామని అన్నారు. పండగకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, దేశంలో ఈ-సేవలు అందించే రాషా్ట్రల్లో ఆంధ్రప్రదేశ మొదటి స్థానంలో నిలవగా, గుజరాత రెండవ, తెలంగాణ మూడో స్థానంలో ఉన్నాయని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. విశాఖలో సోమవారం మొదలైన జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. అనేక సేవలను డిజిటలైజేషన చేసినందుకు ఆంధ్రప్రదేశకు జాతీయ స్థాయిలో ఆరు అవార్డులు వచ్చాయని తెలిపారు. సులభతరంగా వ్యాపారం నిర్వహించడానికి అనుకూలంగా ఉండే రాషా్ట్రల్లోనూ ఏపీదే మొదటి స్థానమని గుర్తు చేశారు. 24 లక్షల మంది రైతుల బ్యాంక్‌ ఖాతాలు, 47 లక్షల మంది వృద్ధులు, వికలాంగుల పింఛన్ల సమాచారం ప్రభుత్వం వద్ద ఉందని చెప్పారు. ఈ-ప్రగతి ప్రాజెక్ట్‌ పూర్తయితే దక్షిణ ఆసియాలో ఏపీగా నంబర్‌వనగా నిలుస్తుందని తెలిపారు.

Comments

comments

Leave a Reply

*