లక్కీ గ్రాహక్‌లకు సన్మానం

అనంతరం లక్కీ డ్రా నిర్వహించి ఎంపికైన వారిని సన్మానించారు. సీఎం, వెంకయ్య నగదు రహిత విధానం ద్వారా రేషన్‌ సరుకులు తీసుకున్న నూజివీడుకు చెందిన కుమారికి రూ.1000 ఖాతాలో జమచేసి, శాలువాతో సత్కరించి మొక్కను అందజేశారు. విజయవాడకు చెందిన డాక్టర్‌ పోతినేని రమే్‌షబాబుకు చెందిన రమేష్‌ కార్డియాక్‌ సెంటర్‌కు రూ.50 వేలు రాగా వాటిని సీఎం సహాయక నిధికి అందజేశారు. లక్కీ డ్రాలో ఎంపికైన పోగిరి జయలక్ష్మి, ఈడీ సరిత, బీఎన్‌ మూర్తిని కూడా సత్కరించారు. మరోవైపు… రాష్ట్ర రెవెన్యూ విభాగం అమలు చేస్తున్న ‘లోన్‌ చార్జి క్రియేషన్‌ ఫర్‌ బ్యాంకర్‌’ మాడ్యూల్‌కు జాతీయ స్థాయిలో ఈ-గవర్నెన్స్‌ అవార్డు లభించింది. మంగళవారం ఈ పురస్కారాన్ని అందించనున్నారు.

Comments

comments

Leave a Reply

*