రెండు సార్లు ప్రధాని పదవి వద్దనుకున్నా!

ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకునేలా రాష్ట్రాభివృద్ధి కోసం పని చేస్తానని, అందుకోసం ఎంతైనా శ్రమిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. మంగళవారం చెన్నైలో ‘ఇండియాటుడే’ గ్రూపు నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. పలు ప్రశ్నలకు తనదైన శైలిలో బదులిచ్చారు. తాను కావాలనుకుంటే దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ కంటే ముందే ప్రధానమంత్రి పదవి చేపట్టి ఉండేవాడినన్నారు. ‘రెండుసార్లు ఈ ప్రధాని పీఠమెక్కే అవకాశం వచ్చినా కాదన్నాను. నా పరిమితులు నాకు బాగా తెలుసు. ఆత్మసంతృప్తి లేకుండా కేవలం పదవుల కోసం పని చేయలేను. రాష్ట్రాభివృద్ధికి పనిచేయడమే నాకు తెలుసు. నా దృష్టి అంతా నా రాష్ట్రంపైనే’ అని స్పష్టం చేశారు. నోట్ల రద్దు వల్ల దేశం అభివృద్ధి చెందుతుందని, నల్లధనానికి అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. నగదు రహిత లావాదేవీల కోసం రాజకీయవేత్తలతో పాటు వ్యాపారవేత్తలు కూడా ముందుకు రావాలని, అవినీతిపై పోరాడాలని పిలుపిచ్చారు. ప్రధాని మోదీ చర్యల కారణంగా 2030 నాటికి భారత ప్రపంచంలోనే నంబర్‌ వన లేదా నంబర్‌ టూ స్థానంలో నిలవడం ఖాయమన్నారు. నోట్ల రద్దు వల్ల 60 రోజులు ప్రజలు ఇబ్బందులుపడ్డ మాట వాస్తవమేనని, కానీ ఇప్పుడు నగదు రహిత లావాదేవీలకు వారు అలవాటు పడిపోయారన్నారు. ఏపీలో నగదు రహిత పెట్టుబడులు 34 శాతం పెరిగాయన్నారు.

Comments

comments

Leave a Reply

*