రిజర్వాయర్లవల్ల ప్రజలపై అదనపు భారం : రేవంత్

ప్రాజెక్టుల్లో 15 నుంచి 20 టీఎంసీల కంటే ఎక్కువ నీటి వినియోగం లేకుండా పోవడం నిజంకాదా? ప్రభుత్వం చెప్పినట్లు ఇవాళ సుమారు 73 కీ.మీ. కాలవాల ద్వారా నీరు ప్రవహిస్తే లిఫ్ట్‌లు కట్టాల్సిన అవసరం లేదని, ప్రజలపై భారం తగ్గుతుందని టీటీడీపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆధివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం 102 టీఎంసీలకు అవసరమైన డిజైన్‌ను ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. తమ్మిడిహట్టి వద్ద నిర్మించే ప్రాజెక్టును ఆదిలాబాద్‌లో కొంత భాగానికి మాత్రమే రెండు లక్షల లోపల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేందుకు పరిమితం చేయడంలో ఉన్న కుట్ర ఏంటో తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత మంత్రి హరీష్‌ మీద ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను మహారాష్ట్రకు తాకట్టు పెట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. రిజర్వాయర్లవల్ల ప్రజలపై విద్యుత్ బిల్లుల రూపంలో రూ. 35 వేల కోట్ల అదనపు భారం పడుతుందున్నారు. దీనిపై జలవనరుల శాఖ మంత్రి హరీష్‌రావు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Comments

comments

Leave a Reply

*