మూడేళ్లలో రూ.17 వేల కోట్లు మాఫీ చేయలేరా?

నకిలీ విత్తనాలతో పంటలు దెబ్బతిని రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీఎల్పీ నేత అనుముల రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆదివారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని పలు గ్రామాల్లో రైతు పోరు యాత్రలో ఆయన పాల్గొని 14 కిలోమీటర్లు యాత్ర చేపట్టారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో రేవంతరెడ్డి మాట్లాడారు. ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని కేసీఆర్‌ మాట ఇచ్చింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మూడేళ్ల కాలంలో రూ.4.50 లక్షల కోట్లు బడ్జెట్‌కు ఖర్చు చేసిన ప్రభుత్వానికి రుణమాఫీ కోసం ఒకేసారి రూ.17 వేల కోట్లు ఇవ్వడానికి చేతులు రావడం లేదన్నారు. దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందన్నారు. టీడీపీ ఆందోళన చేస్తే రూ.6 లక్షల పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని, రాష్ట్ర వ్యాప్తంగా 2,700ల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడితే 400 మందికి మాత్రమే పరిహారం ఇచ్చారని చెప్పారు. ఊరూరా తిరిగి రైతు సమస్యలను పరిశీలించిన కోదండరాం సీఎంను కలవాలనుకుంటే నిమిషం సమయం కేటాయించలేదన్నారు. వాస్తును సరిదిద్దుకోవడం ద్వారా కుమారుణ్ణి సీఎం చేసేందుకు భవనాల మీద రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్న చరిత్ర కేసీఆర్‌దేనని దుయ్యబట్టారు.

Comments

comments

Leave a Reply

*