ముగిసిన చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక్కరోజు పర్యటన ముగి సింది. చంద్రబాబు కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడుతో కలిసి మంగళవారం ఉదయం 10.30 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు. ఆయనకు టీడీపీ గ్రేటర్‌ చెన్నై కన్వీనర్‌ నేతృత్వంలోని కార్యకర్తలు, టీటీడీ సమాచార కేంద్ర చెన్నై సలహామండలి సభ్యుడు ఎం.రవి బాబు, నేతలు బ్రహ్మానందం, రామాం జనేయులు, జ్యోతి, రాజేష్‌, రమేష్‌ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు, వెంకయ్య స్థానిక గిండిలో వున్న ఓ ప్రైవేటు హోటల్లో జరుగుతున్న ఇండియా టుడే గ్రూపు సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. చంద్రబాబుకు దారి పొడవునా ఏర్పాటు చేసిన బ్యానర్లు స్వాగతం పలికాయి. హోటల్లో జరిగిన సదస్సులో చంద్రబాబు, వెంకయ్యలతో పాటు కేరళ ముఖ్యమంత్రి పి.విజయన్, డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంకే స్టాలిన్ తదితరులు కూడా పాల్గొన్నారు.

ఈ సదస్సులో నేతల ప్రసంగం ముగిసిన తరువాత చంద్రబాబు మధ్యాహ్నం 12.45 గంటలకు విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడున్న టీడీపీ కార్యకర్తలు, నేతలు చంద్రబాబుతో సెల్ఫీలు దిగారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ప్రత్యేక హెలిక్యాప్టర్‌ ద్వారా నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు రాక సందర్భంగా విమానాశ్రయం నుంచి సదస్సు జరిగిన హోటల్‌ వరకు పోలీ సు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అంతకు ముందు హోటల్లో టీటీడీ చెన్నై సమాచార కేంద్ర సలహామండలి అధ్యక్షుడు శ్రీకృష్ణ సమావేశమయ్యారు. చంద్రబాబు పర్యటన ఆద్యంతం ఆయన వెంట ప్రముఖ న్యాయవాది రవీంద్రనాధ్‌ చౌదరి వున్నారు.

Comments

comments

Leave a Reply

*