మాధవరెడ్డి కుటుంబానికి టీడీపీ అండ: రేవంత్

మాధవరెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం టార్గెట్‌ చేసిందని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. మీడియాకు లీకులిచ్చి మాధవరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం బాధాకరమని, ఆ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. నయీమ్‌ ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేస్తున్న విచారణపై తమకు నమ్మకంలేదన్నారు. టీఆర్‌ఎస్‌, సీఎం సన్నిహితులను విచారణ నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తమ నేతలను ఇరికించి, ప్రతిష్ఠ దెబ్బతీయాలని చూస్తున్నారని రేవంత్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Comments

comments

Leave a Reply

*