ప్రకటనలలో తప్ప రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగడంలేదు : రేవంత్

నగరంలోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో నూతన హంగులతో సిద్ధమైన టీడీపీ తెలంగాణ శాఖ కార్యాలయాన్ని టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రిక, టీవీ ప్రకటనలలో తప్ప రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగడంలేదని విమర్శించారు.ఈ రోజున సీఎం కేసీఆర్‌ త్రీడీ యానిమేషన్ బొమ్మలను తయారు చేసి.. త్రీడీ బొమ్మలను అమ్ముకుని బతుకుతున్నారని ఆయన విమర్శించారు. టీవీ, పత్రికల్లో త్రీడీ బొమ్మలల్లా కనిపిస్తుందని, జంట నగరాలలోగానీ, గ్రామీణ ప్రాంతాలలోగానీ ఎక్కడా అభివృద్ధి కనిపించడంలేదని ఆయన దుయ్యబట్టారు. అంతకుముందు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడిలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి సైకిల్‌పై ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ భవనకు చేరుకున్నారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు ఆర్పించిన అనంతరం రేవంత్ రెడ్డి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Comments

comments

Leave a Reply

*