పాలనా సంస్కరణలు రావాలి

దేశంలో ఇప్పటికీ బ్రిటీష్‌ కాలంనాటి చట్టాలే అమలులో ఉన్నాయని పరిపాలనలో సంస్కరణలు చేయాల్సి ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా లబ్ధిదారునికే చేరేలా సమాచార సాంకేతిక విధానాన్ని ప్రభుత్వాలు అనుసరించాలని సూచించారు. సమాజంలో మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఇంటికీ కనీసం 50 ఎంబీపీఎస్‌ స్పీడుతో ఇంటర్నెట్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోనే తొలిసారి చేపట్టనున్న ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు రూ.5 వేల కోట్లు అవుతుందని కేంద్రం అంచనా వేసిందన్నారు. ఇందుకు సంబంధించిన ఫైలు ఇంకా కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉందని కానీ రాష్ట్రంలో ఫైబర్‌నెట్‌ ద్వారా ప్రతి ఇంటికీ ఇంటర్నెట్‌, టీవీ, టెలిఫోన్‌ సదుపాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. రాష్ట్రంలో కేవలం రూ.333 కోట్లతోనే ఈ పథకం పూర్తయిందని కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శికి చంద్రబాబు వివరించారు.

Comments

comments

Leave a Reply

*