నేడు చెన్నైకి ముఖ్యమంత్రి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం చెన్నై రానున్నారు. ఓ మీడియా సంస్థ నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తు న్నారు. స్థానిక గిండిలోని ఐటీసీ హోటల్లో ఈ సదస్సు జరుగనుంది. ఉదయం 9.30 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై వస్తున్న చంద్రబాబు.. తిరిగి మధ్యాహ్నం 12.30 గంటలకు హెలిక్యాప్టర్‌ ద్వారా నెల్లూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. మొత్తం మూడున్నర గంటల పాటు నగరంలో గడపనున్న చంద్రబాబు.. ఇక్కడే పలువురు ముఖ్య నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కూడా కలుసుకుంటారని సమాచారం. చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికేందుకు టీడీపీ గ్రేటర్‌ చెన్నై కన్వీనర్‌ చంద్రశేఖర్‌ నేతృత్వంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Comments

comments

Leave a Reply

*