త్యాగాల ఫలితమే నా అభివృద్ధి: నారాయణ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బినామీ అంటూ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహించారు. నోరుందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సమంజసం కాదని, ఆరోపణలు, విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. కేవలం చాక్ పీస్ పెట్టుబడిగా మూడున్నర దశాబ్దాల క్రితం ప్రారంభించిన తన ప్రయాణం, ఎన్నో ఒడుదుడుకులు దాటుకుంటూ ఎంతో వ్యయప్రయాసలు కోర్చి నిత్యం 18 గంటలు కఠోరంగా శ్రమిస్తే ఈ స్థాయికి చేరుకున్నానని నారాయణ వివరించారు. ఈ మూడున్నర దశాబ్దాల శ్రమను కేవలం ఒక మాటతో చాలా తేలిగ్గా బినామీ అంటూ ఆరోపణ చేశారని, ఇది సరికాదన్నారు.

Comments

comments

Leave a Reply

*