తెలంగాణలో రైతులు అనాథలయ్యారు: రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో రైతులు అనాథలయ్యారని, రైతులకు అండగా నిలిచేందుకే పోరుయాత్ర చేస్తున్నట్లు తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరుగుతున్న టీడీపీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా ఇప్పటికీ రైతులకు రుణమాఫీ కాలేదని ఆరోపించారు. పేదోడికి డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా ఇవ్వలేదని, దళితులకు మూడు ఎకరాల భూమి పంచలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. వీటన్నింటికి సమాధానం చెప్పాల్సిన బాద్యత ముఖ్యమంత్రిపై ఉందని అన్నారు.

Comments

comments

Leave a Reply

*