టీడీపీ ఔత్సాహికులకు త్వరలో తీపి కబురు

టీడీపీ ఔత్సాహికులకు తీపి కబురు! త్వరలోనే నామినేటెడ్‌ పదవులు ఇచ్చేందుకు పార్టీ అధినేత, చంద్ర బాబునాయుడు సుముఖత వ్యక్తం చేశారు. వ్యాపారా లు, ఉద్యోగాల నిమిత్తం చెన్నైలో స్థిరపడినప్పటికీ పలువురు తెలుగు వారు టీడీపీ అభిమానులుగా వున్నారు. పొరుగు రాష్ట్రంలో వున్నా టీడీపీకి అండదండ లు అందిస్తున్నారు. ఇలాం టి ప్రముఖుల్లో కొంతమంది టీటీడీ చెన్నై సమాచార కేంద్రం సల హామండలి సభ్యత్వం ఆశిస్తున్నారు. దీనికి సంబంధించి పలువురు చంద్రబాబుకు దరఖాస్తులు సమర్పించినప్పటికీ అదిగో.. ఇదిగో అన్న పదాలు తప్ప ఆశించిన ఫలితం మాత్రం కనిపించకపోవడంతో పలు వురు తీవ్ర నిరాశలో వున్నారు. ఈ నేపథ్యంలో మంగళ వారం చెన్నై వచ్చిన చంద్రబాబు వద్ద టీడీపీ శ్రేణులు మొర పెట్టుకున్నట్టు తెలిసింది. ఆది నుంచి పార్టీని నమ్ముకున్న వున్న తమకు ఏదో ఒక పదవి కట్టబెట్టాలం టూ విన్నవించినట్టు తెలి సింది. దీనిపట్ల చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. త్వరలోనే తగి న న్యాయం చేస్తానని ఆయన హామీనిచ్చినట్టు సమా చారం. అంతేగాక టీటీడీ సలహామండలిలో ఎంతమంది సభ్యులు వుండవచ్చని కూడా అడిగినట్టు సమాచారం. 25 మందికి పైగానే వుండవచ్చని టీడీపీ వర్గాలు చెప్పగా, అయితే ఆ ఖాళీలను భర్తీ చేస్తే సరిపోతుందని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీనిపట్ల టీడీపీ శ్రేణులు కొంత ఉత్సాహంగా వున్నాయి.

Comments

comments

Leave a Reply

*