చట్ట విరుద్దంగా జిల్లాల విభజన: రేవంత్‌రెడ్డి

నియోజకవర్గాల పునర్ విభజన ప్రక్రియ ప్రారంభమైందని, ఈ సమయంలో గ్రామ సరిహద్దు కూడా మార్చడానికి వీలు లేదని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చట్ట విరుద్దంగా జిల్లాల విభజన జరుగుతుందని విమర్శించారు. అగ్రస్థాయికి ఎదిగిన దళిత నేతలను రాజకీయంగా అంతమొందించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 40 నియోజకవర్గాల్లో రాజకీయ ప్రత్యర్థులు లేకుండా చేసుకుంటున్నారన్నారు. నియోజకవర్గాల పునర్ విభజనకు 10 జిల్లాలనే ప్రాతిపదికగా చేసుకోవాలని, దీనిపై కేంద్ర హోం, న్యాయ శాఖ, ఈసీని ఆశ్రయిస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Comments

comments

Leave a Reply

*