కోడి పందాలు వేస్తే కేసులు: చినరాజప్ప

సంక్రాంతి పండగ సంప్రదాయాలను గౌరవిస్తామని, కానీ కోడి పందాలు ఎవరైనా నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప హెచ్చరించారు. సుప్రీం కోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు కోడి పందాలను నిషేధించామన్నారు. మంగళవారం ఆయన గుంటూరులో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముద్రగడ దొంగ దీక్షలు, ఉద్యమాల వల్ల కాపులకు ఒరిగేదేమీ లేదని, కాపుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు.

Comments

comments

Leave a Reply

*