కొత్త విధానాలు.. కేరాఫ్‌ అమరావతి

దేశంలో ఏ కొత్త విధానానికి నాంది పలికినా దానికి కేరాఫ్‌ అడ్ర్‌సగా అమరావతి, విజయవాడ నిలుస్తున్నాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సోమవారం డిజిధన్‌ మేళాను నిర్వహించారు. ఈ మేళాలో కేంద్ర మంత్రి వెంకయ్యతో కలిసి సీఎం పాల్గొన్నారు. సుమారు 80కుపైగా బ్యాంకులు, మొబైల్‌ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను వారు పరిశీలించారు. పెద్ద నోట్ల రద్దును దేశంలో ప్రోత్సహించిన మొట్టమొదటి సీఎంని తానేనని చంద్రబాబు అన్నారు. నవంబర్‌ 8 నాటికి రాష్ట్రంలో కేవలం 8 శాతం డిజిటల్‌ లావాదేవీలు నిర్వహిస్తుండగా, ఈ రోజు 34% మంది డిజిటల్‌ లావాదేవీలు నిర్వహిస్తున్నారన్నారు. మార్చి నాటికి దీన్ని 70 శాతానికి తీసుకెళుతామన్నారు.

డిజిటల్‌ లావాదేవీల నిర్వహణలో ఏపీ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాబోయే రోజుల్లో నగదురహిత లావాదేవీల్లో ఏపీ దేశంలో మొదటి స్థానంలో నిలవాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా డిజిటల్‌ లావాదేవీల పెంచాలని వర్క్‌షాపు నిర్వహించినట్లు గుర్తు చేశారు. తాను సీఎంగా లేని రోజుల్లో కొంత మంది చట్టాన్ని ఉపయోగించుకుని రాషా్ట్రన్ని దోచుకున్నారని, వారిని హీరో్‌సగా కొంత మంది అభిమానించడం విచారకరమన్నారు. రాష్ట్రంలో జూన్‌ నాటికి ఫైబర్‌గ్రిడ్‌ ద్వారా ఇంటింటికీ రూ.149లకే కేబుల్‌ కనెక్షన్‌ ఇస్తామన్నారు.

Comments

comments

Leave a Reply

*