కేసీఆర్ మనిషికాదు కసాయి: రేవంత్

తెలంగాణ సీఎం కేసీఆర్ మనిషి కాదు కసాయి అని టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన రేవంత్.. కేసీఆర్‌ సీఎం అయ్యాక ప్రాణహిత-చేవెళ్లను పక్కనబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రయోజనాలను మహారాష్ట్రకు తాకట్టు పెట్టారని ఆయన మండిపడ్డారు. బాబ్లి వల్ల ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిందని రేవంత్ చెప్పుకొచ్చారు. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ల్లో అవినీతిపై న్యాయపోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రతో ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాం.. ఎలా ఒప్పందం చేసుకుంటారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కాగా ఈ ఉదయం రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Comments

comments

Leave a Reply

*