ఇది శుభపరిణామం: చంద్రబాబు

‘‘రాష్ట్రం ప్రతి ఏటా రెండుమూడు తుఫాన్లను ఎదుర్కొంటోంది. ఇప్పుడు రాష్ట్రం నడిబొడ్డున ఎన్డీఆర్‌ఎఫ్‌ బెటాలియన్‌ ఏర్పాటు చేయడం శుభపరిణామం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో హుద్‌హుద్‌ సమయంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ కీలక పాత్ర పోషించిందన్నారు. రాష్ట్రంలో తుఫాన్లు, కరువు వచ్చినప్పుడు చెన్నై నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వస్తున్నాయని గుర్తుచేశారు. నవ్యాంధ్రలో బెటాలియన్‌ ఏర్పాటు ఆవశ్యకతను వివరించడంతో వెంటనే స్పందించారంటూ కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రమైన ఏపీలో ఐఎస్‌ ఉగ్రవాద ప్రమాదాన్ని కూడా తీసి పారేయలేమని తెలిపారు. ఈ ముప్పును సమర్థంగా ఎదుర్కోవడానికి గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు 850కోట్లు ఇవ్వాలని… సీఆర్‌పీఎఫ్‌, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌(ఆర్‌ఏఎఫ్‌) బెటాలియన్లు కేటాయించాలని కోరారు. ఇందుకు అవసరమైన స్థలం కేటాయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

Comments

comments

Leave a Reply

*