అశాస్త్రీయంగా జిల్లాల విభజన: రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాల విభజనను లోపభూయిష్టంగా చేస్తున్నారని, హడావుడిగా జిల్లాల విభజన ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళ్తోందని ఆయన విమర్శించారు. ఎవరూ డిమాండ్‌ చేయని శంషాబాద్‌ జిల్లాను ఎవరి కోసం ప్రకటించారో సీఎం కేసీఆర్‌ చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రామేశ్వరరావుకు లబ్ది చేకూర్చేందుకే శంషాబాద్‌ను జిల్లా చేశారని ఆయన అన్నారు.
ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చడానికే కేసీఆర్ జిల్లాల విభజన చేశారని, జిల్లాల విభజన ప్రక్రియ అసంపూర్తిగా ఉందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. జిల్లాల విభజన ముసాయిదా లోపభూయిష్టంగా ఉందని జనాభా ప్రాతిపదికన జిల్లాల విభజన చేయడంలేదన్నారు. ఎంతో చరిత్ర కలిగిన వరంగల్‌, హన్మకొండను ఎలా విడదీస్తారని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్‌ పాలన.. తాగుబోతు పాలనలా ఉందని రేవంత్ ఎద్దేవా చేశారు.

Comments

comments

Leave a Reply

*