అవినీతి సొమ్మును రాబడతా!

‘‘అర్హులైన వారందరికీ జన్మభూమి కమిటీల ద్వారా రేషన కార్డులు, పింఛన్లు పంపిణీ చేయాలి. ఇందులో అవినీతి జరిగితే ఉపేక్షించే ప్రశ్నే లేదు. అధికారులు, నాయకులు ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదు. అవినీతికి పాల్పడిన అధికారుల నుంచి సొమ్ము రికవరీ చేస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. అధికారులంతా బాగా పని చేస్తున్నా, అక్కడక్కడా కొందరు మాత్రం ఇబ్బందులు పెడుతున్నారన్నారు. నదుల అనుసంధానంతో సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందన్నారు. స్మార్ట్‌ వాటర్‌ గ్రిడ్‌ ద్వారా తాగునీటి సమస్యే లేకుండా చేస్తామన్నారు. నీటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నెల్లూరు జిల్లా చెన్నూరులో మంగళవారం జన్మభూమి – మా ఊరు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడారు. పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నామని, ప్రస్తుతం రాష్ట్రంలో టెక్నాలజీ పాలన నడుస్తుందని సీఎం పేర్కొన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు భవిష్యత్తులో అందరికి స్మార్ట్‌ఫోన్లు ఇస్తామన్నారు. వచ్చే 3నెలల్లో రాష్ట్రమంతా ఫైబర్‌ గ్రిడ్‌ సేవలు అందు బాటులోకి వస్తాయని తెలిపారు.

Comments

comments

Leave a Reply

*