అద్భుతాలు చూపిస్తాం!

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించే పథకాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రయోగాత్మకంగా చేపట్టాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆ పథకాలను అద్భుతంగా అమలు చేసి ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తామని పేర్కొన్నారు. ఈ-గవర్నెన్స్‌పై రెండు రోజుల జాతీయ సదస్సు విశాఖపట్నంలో సోమవారం ప్రారంభమైంది. సదస్సును సీఎం ప్రారంభించి, మాట్లాడారు. సమాచార సాంకేతిక రంగంలో కొత్తగా ఏ పథకాలు చేపట్టినా వాటన్నింటినీ ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాల్సిందిగా కేంద్ర మంత్రి వెంకయ్యను చంద్రబాబు కోరారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత.. నగదు రహిత లావాదేవీలను విస్తృతపరచడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక చొరవ తీసుకుందని చంద్రబాబు చెప్పారు.

విశాఖపట్నంలో ఫిన్‌టెక్‌ టవర్స్‌ను ప్రారంభించి నగదు రహత లావాదేవీలను విస్తృతపరిచేదిశగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆర్థిక లావాదేవీల్లో నూతన సాంకేతిక విప్లవానికి నాందిపలికేలా జాతీయబ్లాక్‌చైన్‌ టెక్నాలజీ విధాన సంస్థను విశాఖలో ఏర్పాటు చేయాలని వెంకయ్యను సీఎం కోరారు. గతంలో హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీని బిల్డ్‌, ఓన్‌, ఆపరేట్‌ (బీఓటీ) విధానంలో నిర్మించేందుకు ఎల్‌అండ్‌టితో ఒప్పందం చేసుకున్నామని, 14 నెలల్లో ఒక్క పైసా వ్యయం లేకుండా నిర్మాణాన్ని పూర్తి చేయించి, హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని విస్తృతపరచామని సీఎం గుర్తు చేశారు.

Comments

comments

Leave a Reply

*